Monday, January 20, 2025

రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు

- Advertisement -
- Advertisement -

గాందారి : ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన్ని పురష్కరించుకుని నిర్వహించే కుస్తీ పోటీలు కామారెడ్డి జిల్లా గాందారి మండల కేంద్రంలో శుక్రవారం రసవత్తరంగా జరిగాయి. గ్రామ పెద్దల సమక్షంలో పోటీలను నిర్వహించారు. మండలంతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి మల్లయోదులు పోటీల్లో పాల్గొన్నారు. 500 రూపాయల నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు వెండి కడెంతో ముగిసాయి. కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోదులకు సర్పంచ్ సంజీవులు, సొసైటీ చైర్మన్ సాయికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, ఎంపిటిసీ తూర్పు రాజులు, పూనె రాజయ్య, ఆకుల లక్ష్మణ్ బహుమతులను అందజేసారు. కుస్తీ పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్దెత్తున తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News