- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలకు, ధాన్యం కొనుగోళ్లకు, ఫార్మా, వైద్య పరికరాల తయారీ కంపెనీలకు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్ని రకాల వైద్యుల సేవలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. పభుత్వ, ప్రైవేట్ దవాఖానాలు, ఉద్యోగుల సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి వాహనాలకు అనుమతి ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ ఉత్పత్తి, పంపినీ వ్యవస్థలు వాటి అనుబంధ కార్యకలాపాలు, జాతీయ రహదారుల మీద రవాణా యధాతథంగా ఉంటుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఓపెన్‌గా ఉంటాయన్నారు. ఉపాధి హామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
- Advertisement -