Monday, December 23, 2024

శరీరం పటిష్టంగా ఉండాలంటే కదలికలతో కూడిన వ్యాయామం చేయాలి: వైద్యులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రస్తుత ఆధునిక జీవన శైలి, కార్పొరేట్ ఉద్యోగాల నేపధ్యంలో కదలికలతో కూడిన వ్యాయామాలు శరీరానికి ఎంతో అవసరమని డా. భబ్య పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా పురస్కరించుకొని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రి ఫిజియోథెరపీ విభాగం వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బందికి ఫిజియోథెరపీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఎక్కువ గంటలు కూచొని పని చేసే వారు శరీరాన్ని పటిష్టం చేసుకోవడానికి కదలికలతో కూడిన వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని పటిష్టంగా ఉంచుకోవచ్చని అన్నారు. అనంతరం థీమ్ అయిన ఆర్థరైటిస్ కొరకు ఫిజియోథెరపీ అన్న అంశాన్ని వివరిస్తూ కీళ్ల నొప్పులను తగ్గించడానికి శరీరాన్ని నిరంతరం కదలించడం ఎంతో అవసరమని తెలిపారు. ఇలా కీళ్ల నొప్పులకే కాకుండా పలు రకములైన రుగ్మతలను నివారించి శరీరాన్ని నిరంతరం ఆరోగ్యంగా ఉంచుకోవడంలో వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే ప్రతి ఒక్కరు నియమిత రూపంలో క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని సూచించారు. పలు రకాలైన కదలికలతో కూడిన వ్యాయామాలు వివరిస్తూ వారిచే ప్రాక్టీస్ చేయించి ఈ వ్యాయామాలకు సంబంధించిన పలు మెళుకవలను వివరించారు. ప్రత్యేక కార్యక్రమాన్ని డా. సర్దార్, ఛీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, డా. సురేషి లాంఛనంగా ద్వీప ప్రజ్వళన చేసి ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News