హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. స్థానిక ఎన్నికలకు ముందే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు ప్రభుత్వం అమలుచేస్తోంది.
తాజాగా రెండు పథకాలు…ఆసరా పింఛన్లు, రైతు భరోసా అమలు చేసే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా ఆసరా పింఛన్లు పెంచకపోవడంపై అసంతృప్తి నెలకొని ఉంది. ఆసరా పింఛన్లను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు , దివ్యాంగుల పింఛను రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే రైతు భరోసాకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని ఎకరాల వరకు భరోసా ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించాలని భావిస్తోంది.