Friday, December 20, 2024

హైకమాండ్ కనుసన్నల్లో కసరత్తు

- Advertisement -
- Advertisement -

మంత్రివర్గం కూర్పుపై అధిష్ఠానం సమక్షంలోనే నిర్ణయాలు
శాఖల కేటాయింపులపైనా ఢిల్లీదే నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూ ర్తిస్థాయి మంత్రివర్గ కూర్పు, శాఖ ల కేటాయింపులపైనా దృష్టిసారించింది. మంత్రివర్గం కూర్పు, శాఖ ల కేటాయింపులపై కూడా అధిష్ఠానం సమక్షంలో నిర్ణయాలు జరిగిపోవాలని కొందరు సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో అం దుకు అధిష్ఠానం పెద్దలు కూడా అంగీకరించారని, అందుకే నూత న ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్‌రెడ్డి ని కూడా ఢిల్లీకి పిలిపించారని కొం దరు సీనియర్ నాయకులు వివరించారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి అధిష్ఠానం పెద్దల బుజ్జగింపులతో తమ ప్రయత్నాలను విరమించుకొన్న మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దుద్ది ళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోద ర్ రాజనరసింహా వంటి సీనియర్లు మంత్రివ ర్గం కూర్పు సమక్షంలో జరగాలని గట్టిగా డిమాండ్ చేశారని, వారి కోరికలో కొంత న్యాయం ఉందని అభిప్రాయానికి వ చ్చిన అధిష్ఠానం పెద్దలు మంగళవారం సాయంత్రం సిఎం అభ్యర్థి రేవంత్‌ రెడ్డిని హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారని ఆ నాయకులు వివరించారు. పనిలోపనిగా ప్రమాణస్వీకారోత్సవానికి అతిథులుగా సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాం ధీ, ప్రియాంకగాంధీ, కెసి వేణుగోపాల్, డికె శివకుమార్ తదితర ఎఐసిసి అగ్రనాయకులను ఆహ్వానించడానికి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లుగా మీడియాకు అధికారిక ప్రకటన జారీ చేశారని వివరించారు.

వాస్తవానికి అధిష్ఠానం పె ద్దలే కాకుండా రేవంత్‌రెడ్డి కూడా ఎఐసిసి అగ్రనేతల సమక్షంలోనే మంత్రివర్గంలోనికి ఎవ్వరెవ్వరిని తీసుకోవాలనే అంశాలపై సమాలోచనలు జ రిపేందుకు సంసిద్ధ్దంగానే ఉన్నారని, సీనియర్లతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇదే బెటర్ అని కూడా రేవంత్ తన సన్నిహితులో అన్నారని కూడా ఆ నా యకులు వివరించారు. తనకిష్టమొచ్చినట్లుగా కే బినెట్ రూపుదిద్దుకొందనే వాదనలు వస్తే అది తనకు కూడా ఇబ్బందిగానే ఉంటుందని, అలా కాకుండా అధిష్ఠానం సమక్షంలోనే కేబినెట్ ని ర్మాణం జరిగితే సీనియర్లనే కాకుండా తనకు సన్నిహితంగా ఉన్న నేతలు కూడా తనను నిందించుకోవడానికి వీలులేకుండా ఉంటుందని, అందుచేతనే అధిష్ఠానం చెప్పిన వారికే మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి సమస్యలూ ఉండవని కూడా రేవం త్ గట్టిగా భివిస్తున్నారని అన్నారు. అయితే ఇప్ప టి వరకూ మీడియాకు లీకులిచ్చిన నాయకుల పేర్లలో కొన్ని వాస్తవాలు కూడా ఉండివుండవచ్చునని అంటున్నారు. సిఎంగా రేవంత్‌రెడ్డితో పాటు గా కేబినెట్‌లో మరో ఆరుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు మంత్రులయ్యే అవకాశాలున్నాయని, మంత్రివర్గం (సిఎంతో కలుపుకొని)లో మొత్తం 18 మందితో ఏర్పాటవుతుందని, అందులో సింహభాగం రెడ్లకే మంత్రి దక్కుతాయని, ఆ తర్వాత సామాజిక సమీకరణాలు, మహిళలకు రిజర్వేషన్, మల్లు భట్టి విక్రమార్క, గిరిజన మహిళగా ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన సీతక్కలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కవచ్చునని, భట్టితో పాటుగా సీతక్కకు కూడా డిప్యూటీ సిఎం పదవి కోసం రేవంత్‌రెడ్డి గట్టిగా పట్టుబట్ట వచ్చునని ఆ నాయకులు భావిస్తున్నారు.

అదీగాక భట్టి విక్రమార్కకు ఆర్ధిక, రెవెన్యూ వంటి పెద్ద శాఖల్లో ఏదో ఒకటి అప్పగించవచ్చునని, సీతక్కకు మాత్రం హోంమంత్రిత్వ కేటాయిస్తే బాగుంటుందని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన శాంతి-భద్రతల శాఖ వరకూ సిఎం వద్దనే ఉంచుకొని మిగతా విభాగాలతో కూడిన హోంశాఖను సీతక్కకు అప్పగించవచ్చునని అంటున్నారు. కాగా స్పీకర్ పదవిని ఒక మహిళకు అప్పగిస్తే బాగుంటుందని, అందుకే కొండా సురేఖ అయితే అనుభవజ్ఞురాలని, ప్రతిపక్ష పార్టీలను గట్టిగా, సమర్థవంతంగా ఎదుర్కోగలదని, అత్యంత కీలకమైన, ప్రొటోకాల్‌లో ముఖ్యమంత్రి కంటే కూడా పెద్ద పదవి కావడంతో ఆ పదవికి కొండా సురేఖగానీ, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనుభవజ్ఞుడు అయిన తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని వివరించారు.ఇలా దామోదర్ రాజనరసింహా, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, కామారెడ్డిని త్యాగం చేసిన షబ్బీర్ ఆలీని కూడా కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఎలాగూ ఆరు ఎంఎల్‌సి స్థానాలు ఖాళీగా ఏర్పడ్డాయని, పార్టీకోసం పనిచేసిన సీనియర్లకు ఎంఎల్‌సిలుగా ఎంపిక చేసుకొని మంత్రి పదవులు ఇవ్వవచ్చునని అంటున్నారు. అధిష్ఠానానికి నమ్మినబంటుగా పేరున్న వి.హనుమంతరావు పేరు కూడా ఢిల్లీ పెద్దల పరిశీలనలో ఉందని కూడా ఆ నాయకులు వివరించారు. ఇలా రకరకాలుగా సీనియర్ నాయకులు, ఎంఎల్‌ఎలు తమతమ అభ్యర్థ్ధిత్వాలను పరిశీలించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కొంద రు నాయకులు మంగళవారం గచ్చిబౌలిలోని ఓ స్టార్‌లో హోటల్‌లో ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి విన్నపాలు చేసుకొన్నారని, మరికొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం పెద్దల వద్ద తమతమ డిమాండ్లను ఉంచినట్లుగా వివరించారు. ఏది ఏమైనా ఈనెల 7వ తేదీన జరుగనున్న ప్రమా ణ స్వీకారోత్సవం సమయం వరకూ మంత్రివర్గంలో స్థానం పొందిన నాయకుల వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేవని, బుధవారం రాత్రికిగానీ, గురువారం (7వ తేదీ) ఉదయానికి జాబితా బయటకు వస్తుండవచ్చునని ఆ నాయకులు వివరించారు. అయితే మంత్రివర్గంలో తీసుకొంటున్న నాయకులకు సాధారణ పరిపాలనా శాఖ నుంచిగానీ, గాంధీభవన్ నుంచి ఫోన్ వెళుతుందని, మంత్రిగా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని చెబుతారు గనుక ఆ సమయంలోనే మంత్రుల జాబితా బయటకు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News