Wednesday, January 15, 2025

నామినేటెడ్ పై కసరత్తు

- Advertisement -
- Advertisement -

కీలక నేతలకు కేబినెట్ హోదా

కేబినెట్‌లో చోటుకు పరిమితులు

కార్పొరేషన్ పదవుల పంపకానికి సిఎం ప్రథమ ప్రాధాన్యం

సీనియర్లకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎంఎల్‌ఎలకు అనేక కీలకమైన పదవులను ఇచ్చి గౌరవించాలని అగ్రనాయకత్వం కృతనిశ్చయంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీ జెండాతో గెలుపొందిన ఎంఎల్‌ఎలు పడ్డకష్టాలన్నీ తొలగించడానికి, వారికి మంత్రులతో సమానహోదా ఉన్న పలు కీలకమైన చైర్మ న్ పదవులను కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నా రు. అందులో భాగంగానే కనీసం 25 మంది ఎంఎల్‌ఎల (సీనియర్లు)కు కేబినేట్ మినిస్టర్ హోదా ఉన్న చైర్మన్ పదవులను ఇచ్చి గౌరవించాలని, అందుకు ఎ ఐసిసి ఆమోదముద్ర పొందేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఏర్పాట్లు చేశారని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. అందులో భాగంగానే ఈ నెల 19వ తేదీన సీఎం రేవంత్ న్యూఢిల్లీకి వెళ్లి తన వ్యూ హాలను అధిష్ఠానం పెద్దలకు వివరించడమే కాకుండా కార్పొరేషన్‌లకు 25మంది ఎంఎల్‌ఎలను నియమించనున్నట్లుగా వివరించి ఆమోదం పొందనున్నారని తెలిపారు.

ఈ 25మంది ఎంఎల్‌ఎలే కాకుండా ఎంఎల్‌ఎలుగా పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్లకు కూడా నామినేటెడ్ పదవులను కట్టబెట్టి ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేబినెట్‌లోకి అదనంగా ఆరు, ఏడుగురిని మించి తీసుకునే పరిస్థితి లేదు. సీనియర్ల సేవలు ఉపయోగించుకోవాలంటే కార్పొరేషన్ పదవులే దిక్కు. పైగా చిన్నాచితక కార్పొరేషన్లు కాకుండా చేతినిండా పని ఉండే బడా కార్పొరేషన్లకు సీనియర్లను నామినేటెడ్ చేయాలని ఆయన యో చిస్తునారు. రాష్ట్ర ప్రభుత్వంలో మొత్తం 54 కార్పొరేషన్లు, సంస్థలు, కమిషన్లు ఉన్నాయ ని, వాటితో పాటుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, కమిషన్‌ల సభ్యులు, ఇతర డిజిగ్నేటెడ్ పదవులకు కూడా పార్టీ జెండాలు మోసిన అధికారాన్ని క ట్టబెట్టిన కేడర్‌కు దక్కేటట్లుగా చేయాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఇదే అంశాలను సోమవారం గాం ధీ భవన్‌లో జరిగిన పిఎసి మీటింగ్‌లో కూడా చాలా గట్టిగా చెప్పారని ఆ నాయకు లేకపోయినప్పటికీ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ జెండాలు మోశారని, ఆర్థ్ధికంగా చితికి పోయినప్పటికీ పార్టీనే నమ్ముకొని కొన్ని వేల మంది కార్యకర్తలు అహోరాత్రు లు పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం శక్తివంచన లేకుండా కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిఎసి సమావేశంలో కేడర్ పడ్డ కష్టాలను వివరించి అందరి ఆమోదాన్ని తీసుకొన్నారని వివరించారు.

కార్పొరేషన్లలో అత్యంత కీలకమైన, కేబినెట్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి టిఎస్ ఆర్‌టిసి చైర్మన్, రాష్ట్ర ప్రణాళికా ఉపాధ్యక్షుడు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, టెక్నాలజీ సర్వీసెస్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, మినరల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, రాష్ట్ర బ్రూవరేజెస్ కార్పొరేషన్, మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తెలంగాణ సాహిత్య అకాడమి, ఫిలిం డవలప్‌మెంట్ కార్పొరేషన్, ట్రైకార్ చైర్మన్, వికలాంగుల అభివృద్ధి సంస్థ, బిసీ కార్పొరేషన్, ఎస్‌సి కార్పొరేషన్, గిరిజన కార్పొరేషన్, ఆయా సంక్షేమ శాఖల పరిధుల్లోని ఫైనాన్స్ కార్పొరేషన్లతో పాటుగా బిసి కమిషన్, ఎస్‌సి కమిషన్ వంటి హైకోర్టు జడ్జి అధికారాలున్న సంస్థలు కూడా ఉన్నాయని, వాటన్నింటికీ పార్టీలోని సీనియర్ నాయకులు, విద్యావంతులను నియమించి వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించడమే కాకుండా ఈ మేరకు ఒక జాబితాను కూడా సిద్ధ్దం ఆ నాయకులు వివరించారు. ఇలా 54 కార్పొరేషన్లు, డైరెక్టర్లు, సభ్యులు వంటి అనేక నామినేటెడ్ పదవులిస్తే కనీసం 500 మంది నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇచ్చినట్లవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, ఆ నియామకాలు జరపాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.

ఈనెలాఖరులోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం లక్ష్యంగా పెట్టుకొన్నారని వివరించారు. చైర్మన్ పదవికి నెలకు 2.50 లక్షల రూపాయల వరకూ వేతనాలు ఉంటాయని, డైరెక్టర్లు, సభ్యులకు నెలకు 1.50 లక్షల నుంచి 1.75 లక్షల రూపాయల వరకూ వేతనాలు ఉంటాయని, దాంతో పార్టీనే నమ్ముకొన్న నాయకులు, కార్యకర్తలు, పార్టీలోని విద్యావంతులు, మేధావులకు కొద్దిపాటి ఊరట కలిగించినట్లవుతుందని సిఎం రేవంత్ అన్నారని ఆ నేతలు వివరించారు. గడిచిన పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీనే నమ్ముకొని, పార్టీ కోసం కష్టపడ్డ నేతలు వేల సంఖ్యలో ఉన్నారని, గత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ఎంఎల్‌ఎల వేధింపులకు కూడా గురయ్యి అష్టకష్టాలుపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎందరో ఉన్నారని, చివరకు పోలీస్ కేసులను ఎదుర్కొని, భౌతిక దాడులను కూడా చవిచూసిన కేడర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉందని, అలాంటి కేడర్‌ను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని అనడమే కాకుండా, ‘కేడర్‌కే టాప్ ప్రయారిటీ’ ముఖ్యమంత్రి రేవంత్ బహిరంగంగానే అనేక పర్యాయాలు ప్రకటించారని, ఆ ప్రకటనలను నమ్ముకొన్న కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ తీసుకునే నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారని, అందుకే వారి ఆశలు.. ఆశయాలకు తగినట్లుగా నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచితంగా గౌరవించనున్నారని వివరించారు.

కొద్దిరోజుల్లోనే కేడర్ పదవులు కట్టబెట్టే ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభిస్తారని, తద్వారా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు గట్టి భరోసా ఇవ్వాలని, కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా, అధినాయకుడి పట్ల సానుకూల దృక్ఫధంతో ఉండే విధంగా చేయాలని సిఎం కృతనిశ్చయంతో ఉన్నారని వివరించారు. కేడర్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చే నాయకుడిగా, కేడర్‌ను పార్టీకి వెన్నెముకగా భావించి మన్ననలను పొందిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కేడర్‌కు అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యతలు ఇస్తున్న వ్యక్తిగా సిఎం రేవంత్‌రెడ్డి నిలుస్తారని, అందుకు తగినట్లుగానే ఆయన చర్యలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగినట్లుగా పిఎసి సమావేశంలో పాల్గొన్న పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి స్పందించిన తీరు నిలువెత్తు నిదర్శనమని ఆ నాయకులు వివరించారు. కేడర్‌ను ఆదుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించిన ప్రతిపాదనలు అభినందనీయమని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చించుకొంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ‘నామినేటెడ్ పదవుల భర్తీకి కౌంట్‌డౌన్ స్టార్ట్’ అయ్యిందని, ఆ నాయకులు ధీమాగా చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News