Monday, December 23, 2024

రేషన్ కార్డులపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండింగ్ లో ఉన్న ఫైళ్లు వాటికి సంబంధించిన పనులపై దృష్టి సారించింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది. సచివాలయంలో పౌర సరఫరా ల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని నెలలుగా రేషన్ తీసుకోలేని కార్డులను ఉంచాలా లేక తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు. అసలైన అర్హులకే కా ర్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమా ర్ రెడ్డి సూచించారు. మరోవైపు కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై మరింత సమగ్రంగా లో తుగా చర్చలు జరుపనున్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే.. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలో చనలో ప్రభుత్వం ఉంది. అయితే . కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవటంతో ప్రజలు ఎంతో ఆశతో  ఎదురుచూస్తున్నారు.

రాష్ట్ర జనాభా 3,52,86,757 కాగా ఆహరభద్రత కింద 89,98,546 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఒక్కో కుటుబానికి చెందిన రేషన్ కార్డులో ఇద్దరు, ముగ్గురు నలుగురు అపైన గరిష్టంగా ఆరు మందివరకూ సభ్యులు ఉన్నారు. రేషన్‌కార్డుల్లో సభ్యులుగా ఉన్న వారి సంఖ్యకూడా తక్కువేమికాదు. మొత్తం 2.90కోట్ల మంది రేషన్‌కార్డుల్లో సభ్యులుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యం కొనుగోలుకు రూ.39 చేస్తోంది. ప్రతినెల రేషన్‌కార్డులపై ఒక్కో సభ్యుడికి ఆరు కిలోల చొప్పున రేషన్‌డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 5కిలోలు అందజేస్తుండగా ,రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో బియ్యం అందజేస్తోంది. ఒక్కొ వ్యక్తికి ప్రతినెల రేషన్‌బియ్యం కింద ప్రభుత్వం రూ.234 ఖర్చు చేస్తోంది.

పెండింగ్‌లో 11.02లక్షల ధరఖాస్తులు
రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం పేద ప్రజలు దరఖాస్తులు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా వాటి మంజూరులో పురోగతి లేకుండా పోయింది. ఇప్పటివరకూ 11.02 లక్షల ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిరుపేద కుంటంబాల్లో రేషన్‌కార్డులపై మళ్లీ ఆశలు చిగురించారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తులు ప్రారంభించింది. విధివిధానాలు రూపొందించి ప్రభుత్వం రేషన్‌కార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే కొత్తగా మరో 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న 11.02లక్షల ధరఖాస్తులుతోపాటు కొత్తవారి నుంచి కూడా దరఖాస్తులు వస్తే వీటి సంఖ్య 22లక్షలు దాటే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరినాటికి విధివిధానాలు సిద్దమైంతే నూతన సంవత్సర కానుకగా జనవరి నుంచి రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News