Monday, December 23, 2024

అభ్యర్థుల ఎంపికపై హస్తినలో కసరత్తు

- Advertisement -
- Advertisement -

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరిన సిఎం రేవంత్ రెడ్డి

ఖర్గే, సోనియా, రాహుల్‌తో మంతనాలు

ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ చర్చ
ఎంపి ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల జాబితా అధిష్ఠానానికి

నేడు కేంద్ర మంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి

14న మణిపూర్‌లో ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు హాజరు
అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకొని దావోస్ పర్యటనకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్:  ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎ యిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లా రు. రేవంత్ పార్టీ సమావేశంలో పాల్గొనడంతో పాటు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులతో సమావేశం కానున్నట్టుగా తెలిసింది. నేడు (శనివారం) పలువురు కేంద్ర మంత్రులతో సిఎం రేవంత్ భేటీ కానున్నారు. ఎల్లుండి (ఆదివా రం) ఉదయం మణిపూర్ వెళ్లి రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో రేవంత్ పా ల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకొని అక్కడి నుంచే నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరుకానున్నారు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండడంతో పాటు మరో మూడు రోజులు సిఎం రేవంత్ లండన్‌లో పర్యటించనున్నారు.

తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సిఎం పాల్గొంటున్నారు. సిఎం రేవంత్ వెంట మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సి ఎంఒ సెక్రటరీలు, ఒఎస్‌డి తతదితరులు దావోస్ వెళ్తున్నారు. పది రోజుల తర్వాత తిరిగి ఈ నెల 23వ తేదీన సిఎం రేవంత్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
సోనియాతో పలు అంశాలపై చర్చ
ఢిల్లీ వెళ్లగానే ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఎఐసిసి అగ్ర నేత సోనియా గాంధీని రేవంత్ ఆమె నివాసంలో కలిసినట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలకు సంబంధించి ఇరువురు చర్చించినట్టుగా తెలిసిం ది. అలాగే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయాలని కూడా మరోసారి రేవంత్ సోనియాకు విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది.ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీల భర్తీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్ సభ ఎన్నికలు నేపథ్యంలో సిఎం ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి టికెట్ల విషయంలో త్యాగం చేసిన పలువురు నేతలు ఎంఎల్‌సి ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈసారి ఎంఎల్‌సి దక్కించుకోబోయే వారిలో కనీసం ఒకరికి మంత్రి వర్గంలో చోటు ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎంఎల్‌సి టికెట్ తమకే ఇవ్వాలని నేతలు పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంలో అధిష్ఠానం ఎటువంటి సూచనలు చేయబోతున్నది అనేది చర్చనీయాశంగా మారింది. ఇక గురువారం సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన కూడా పార్టీ అధిష్ఠానంతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం టూర్‌కు ఒక రోజు ముందే జగ్గారెడ్డి హస్తిన బాట పట్టడం వెనుక ఏం జరుగుతోందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఆసక్తిరేపుతున్నాయి.

విదేశీ పర్యటన తరువాత సమన్వయకర్తలతో సిఎం సమీక్షలు
పదవులు ఆశిస్తున్నవాళ్ల జాబితాను అధిష్టానం ముందు సిఎం రేవంత్ రెడ్డి ఉంచబోతున్నారు. అభ్యర్థులను పరిశీలించి అధిష్ఠానం తన నిర్ణయం ప్రకటిస్తుంది. ఈనెల 15వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఉంది. తిరిగి వచ్చాక లోక్‌సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News