Monday, January 20, 2025

ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్‌రాజ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడం చాలా కీలకమని, పట్టణ ఓటర్ల, యువత ఉదాసీనత ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 5కె రన్‌ను ఆయన ప్రారంభించారు. 20 వేల మంది ఐటి ఉద్యోగులు, నగరవాసులు ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం కీలకమన్నారు. అర్హత కలిగిన పౌరులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, పోలింగ్ రోజున ఓటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -27 ఆగస్టు (నేడు) & సెప్టెంబర్ 2,3వ తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కేంద్రాలు పనిచేస్తాయని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ సిఈఓ సర్ఫరాజ్ అహ్మద్, నోడల్ అధికారి భవానీశంకర్, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటరు నమోదుకు రాష్ట్రవ్యాప్తంగా స్పందన…
శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సిఈఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. 33 జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన సమీక్షించారు. తొలిసారి ఓటర్లను నమోదు చేసుకోవడంతో పాటు చేర్పులు, మార్పులపై ఓటర్లు కేంద్రాలను సందర్శిస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News