Friday, November 22, 2024

21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శన

- Advertisement -
- Advertisement -

Exhibition of gandhi film till 21Th august

ప్రతిరోజు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ప్రదర్శన

హైదరాబాద్ : స్వాతంత్య్ర ఉద్యమ తీరు.. ఉద్యమకారుల త్యాగాలను నేటి తరానికి అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 552 ధియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ బయోపిక్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.75 ఏండ్ల స్వపరిపాలనలో సాధించిన ప్రగతిని స్వాతంత్య్ర ఉద్యమకారుల ఆకాంక్షలతో భేరిజు వేసుకునేందుకు వజ్రోత్సవ వేడుకలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శిస్తున్న ‘గాంధీ సినిమా విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిరోజు 2.50 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తోంది. ఇప్పటి వరకు గాంధీ చిత్రాన్ని 22.50 లక్షల మంది విద్యార్థులు తిలకించారు. ఈ నెల 21 వరకు గాంధీ చిత్ర ప్రదర్శనను కొనసాగించనున్నారు.

స్వాతంత్ర ఉద్యమ తీరు తెన్నులు..
నాటి స్వాతంత్ర ఉద్యమ తీరు తెన్నులు- బ్రిటిష్ వారి దమనరీతిని ధీటుగా ఎదుర్కొనేందుకు సువిశాల దేశంలోని ప్రజలందరిని కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంఘటితం చేసేందుకు తరతరాలుగా భారతీయులు ఆనుసరిస్తున్న అహింసనే ఆయుధంగా చేసుకుని భారత స్వాతంత్రోద్యమానికి దిక్సూచిగా నిలిచిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఆయన జీవితమే ఒక ఉద్యమం. నాటి వ్యవస్థ, పాలనా తీరు, పాలకుల వైఖరిపైన సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి గాంధీ. ఇంగ్లాండులో బారీష్టరు చదివి, దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేసిన తొలి రోజుల్లోనే బ్రిటిష్ జాత్యాహంకారం పైన అహింసాత్మక నిరసనను వ్యక్తం చేశారు. అహింస బలహీనత కాదని.. వ్యక్తి మానసిక పటుత్వానికి ప్రతీకగా ప్రగాఢముగా విశ్వసించి, ఆచరించిన గొప్ప వ్యక్తి గాంధీ. అనంతరం దేశానికి తిరిగివచ్చి సత్యం -అహింస లను ఆయుధాలుగా దేశ ప్రజలను సంఘటిత పరచి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. ప్రజల మధ్య ఐక్యతను ఆకాంక్షిస్తూ తుది శ్వాస విడిసిన మహనీయుడు గాంధీ.

గాంధీ చిత్రాన్ని తిలకించిన 350 మిలియన్ల ప్రజలు
1948లో మృతి చెందిన మహాత్మాగాంధీ జీవిత గాథను 1982లో ఇంగ్లీష్‌లో తీసిన ‘గాంధీ బయోపిక్‘ని ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది చూశారు. గాంధీ ప్రవచించిన సత్యం, -అహింసలు అనేక దేశాల్లో జరిగిన స్వాతంత్య్ర పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి. హక్కుల కొరకు జరిగే పోరాటంలో మార్టిన్ లూధర్ కింగ్‌కు గాంధీ సిద్ధాంతాలే మూలంగా నిలిచాయి. మహాత్మాగాంధీని స్ఫూర్తిగా తీసుకుని నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ నేత కె చంద్రశేఖర్‌రావు తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి అవాంఛనీయ, అసాంఘిక సంఘటనలకు తావియ్యకుండా అందరిని ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News