Monday, December 23, 2024

పూడ్చిన శవం వెలికితీసి పోస్టుమార్టం

- Advertisement -
- Advertisement -

మక్తల్: కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా గ్రామంలో పూడ్చిపెట్టారు. అనుమానం వచ్చిన మక్తల్ పోలీసులు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి రావడంతో పూడ్చిన శవాన్ని శనివారం వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మక్తల్ మండలం చిట్యాలకు చెందిన కుర్వ కొక్కిరి శివలింగమ్మ కూతురు సుజాత(19)కు గత మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన నర్సిములుతో వివాహం జరిపించారు.

అయితే గత నెల 16న సుజాత కడుపు నొప్పి భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన సుజాతను మహబూబ్‌నగర్‌కు తరలించగా, అక్కడే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 31న మృతి చెందింది. అయితే సుజాత మృతి చెందిన విషయాన్ని దాచిన కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని పూడ్చిపెట్టారు. అయితే అంతకుముందు ఆత్మహత్యాయత్నం కేసును నమోదు చేసిన మక్తల్ పోలీసులకు చికిత్స విషయంలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామంలో ఆరా తీయగా సుజాత మృతి చెందిన విషయం తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న మక్తల్ పోలీసులు శనివారం సుజాత శవాన్ని వెలికితీయించి వైద్యులచే పోస్టుమార్టం నిర్వహించి మళ్లీ ఖననం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News