Wednesday, January 22, 2025

సరైన ఓటింగ్ గణాంకాలు అందించిన ఎగ్జిట్ పోల్స్

- Advertisement -
- Advertisement -
Exit polls 2022 provide accurate voting statistics
నాలుగు రాష్ట్రాల్లో బిజెపి … పంజాబ్‌లో ఆప్ చారిత్రక విజయం

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో బిజెపికి స్పష్టమైన ఆధిక్యతతో విజయం లభిస్తుందని, పంజాబ్‌లో ఆప్ చారిత్రక విజయం సాధిస్తుందని ముందుగా ముందుగా అంచనా వేయడంలో ఎన్నికల పరిశీలకులు విజేతలయ్యారు. అయితే ఉత్తరాఖండ్ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్ అంచనాలు దారి తప్పాయి. ఉత్తరాఖండ్‌లో 11 స్థానాల్లో బిజెపితో గట్టిపోటీ కాంగ్రెస్‌కు ఉంటుందని, కాంగ్రెస్ కన్నా స్వల్ప మెజార్టీ బిజెపికి వస్తుందని అంచనాలు వెల్లడించగా, గురువారం వెలువడిన ఫలితాల్లో బిజెపికి అఖండ విజయం లభించి, కాంగ్రెస్ బాగా వెనుకబడిపోవడం గమనార్హం. దాదాపు ఎనిమిది ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయి. ఎబిపి న్యూస్ సి ఓటర్ , ఇటిసి రీసెర్చి,ఇండియా టుడేయాక్సిస్ మై ఇండియా, ఇండియా టివిసిఎన్‌ఎక్స్,జీ న్యూస్‌డిజైన్‌బాక్స్‌డ్, ఇండియా న్యూస్, న్యూస్ 24 టుడేస్ చాణక్య అండ్ రిపబ్లిక్ పిమార్క్‌తదితర ఎగ్జిట్ పోల్స్ అన్నీ బిజెపికి ఉత్తరప్రదేశ్‌లో 240 ప్లస్ సీట్లు వస్తాయని అంచనా వేశాయి.

ఆ రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాల్లో బిజెపి దాని మిత్రపక్షాలతో కలుపుకుని సగటు సీట్ల కేటాయింపు 241 వరకు ఉంటుందని అంచనా వేశాయి. అలాగే అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాది పార్టీకి సరాసరి 142 సీట్లకే పరిమితమని పేర్కొన్నానయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా బిజెపికి 288 నుంచి 326 వరకు సీట్లు వస్తాయని, న్యూస్ 24 టుడే చాణక్య 294, ఇండియా టివిగ్రౌండ్ జీరో రీసెర్చి 182 నుంచి 220 సీట్లు బిజెపికి వస్తాయని సర్వేలో వెల్లడించాయి. అయితే ఇప్పుడు బిజెపి 253 సీట్లలో, ఎస్‌పి 114 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ పెద్ద విజయం పంజాబ్ అంచనాల్లో కనిపించింది. పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీపార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేయగా, అదేవిధంగా పంజాబ్‌లో ఆ పార్టీ చారిత్రక విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ ఆప్‌కు సరాసరిన 63, కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని వెల్లడించగా, ఆప్‌కు 92, కాంగ్రెస్‌కు 18 సీట్లు దక్కడం విశేషం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పంజాబ్‌లో బిజెపికి ఒకటి నుంచి నాలుగు వస్తాయని, 76 నుంచి 90 సీట్లు ఆప్‌కు వచ్చి స్పష్టమైన విజయం లభిస్తుందని ఎన్నికల పరిశీలకులు అంచనా వేశారు.

న్యూస్ 24 టుడే చాణక్య పోల్స్ ఆప్‌కు 100, కాంగ్రెస్‌కు 10 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 సీట్లలో బిజెపి, కాంగ్రెస్ మధ్య 35 32 సీట్లతో ముఖాముఖి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, గురువారం సాయంత్రానికి బిజెపికి స్పష్టంగా 47, కాంగ్రెస్‌కు కేవలం 19 సీట్లే దక్కడం చెప్పుకోదగిన విశేషం. గోవాలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండిటికీ చెరో 16 సీట్లు లభించి హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, బిజెపికి 20 సీట్లు, కాంగ్రెస్‌కు 11 సీట్లు వచ్చాయి. మణిపూర్‌లో 30 సీట్లు బిజెపికి వస్తాయని పోల్స్ చెప్పగా, 29 సీట్లతో బిజెపికి ఘన విజయం లభిస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు కచ్చితంగానే వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News