Thursday, January 23, 2025

ఎగ్జిట్ పోల్స్ అశాస్ర్తీయం

- Advertisement -
- Advertisement -
గతంలో ఐదు సంస్థలు సర్వేచేస్తే ఒక్కటే నిజమైంది

మన తెలంగాణ/హైదరాబాద్ :  ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్ పోల్స్ సర్వే జరుగుతుందని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, 100 శాతం బిఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. కొ న్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుం డా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారని తెలిపా రు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైందని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రజలు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉండగానే… అప్పుడే ఎగ్జి ట్ పోల్స్ వెల్లడించడటమేంటని ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్ 3న ఎగ్జిట్ పోల్స్ తప్పు అయితే.. తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్ పోల్స్ ప్రచురించిన మీడియా సంస్థలను కెటిఆర్ నిలదీశారు.

తెలంగాణ భవన్‌లో గురువారం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వారివి  ప్రభావితం అయ్యేలా నిర్ణయం తీసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ ఆ లోచించాలని కోరారు. ఈ విషయంపై రా ష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడితే ఎన్నికల కమిషన్ నిబంధనలు అలాగే ఉన్నాయనితెలిపారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న నిబంధనలను మారిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దుష్ప్రచారాలు, అబద్ధాలు, నకిలీ వీడియోలతో ప్రజలను ప్రభావితం చేసేలా పని చేస్తు న్న పార్టీలపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవడంపైన ఆలోచించాలన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయానికి గంట, గంటన్నర సమయం పోలింగ్ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానా ల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తుది పోలింగ్ శాతం తేలిన తర్వాత.. ఎంత పోలింగ్ అయ్యింది.. ఎక్కడ ఎంత అయ్యింది.. ఏ నియోజకవర్గంలో ఎంత అయ్యిందనేది విశ్లేషించుకోవచ్చని అన్నారు.
అంచనాలకు భిన్నంగా ఫలితాలు వస్తాయి
ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తెలంగాణ ఫలితాలు వస్తాయని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అసలైన ఫలితం డిసెంబర్ 3న వస్తుందన్నారు. 2018లోనూ టిఆర్‌ఎస్(బిఆర్‌ఎస్) ఓడిపోతుందని చాలా సంస్థలు చెప్పాయని, అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తప్పాయని గుర్తుచేశారు. అప్పుడు ఫలితాలు ఎలా వచ్చాయో.. ఈసారి కూడా అలాంటి ఫలితాలే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2018లో ఎగ్జిట్ పోల్స్‌లో ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందని గుర్తు చేశారు. ఈసారి తమకు 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నామని.. కానీ 70 స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదు అని, ఈరకమైన ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశామని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నిరూపించడం తమకు కొత్తేమీ కాదని చెప్పారు. గత 90 రోజులుగా బిఆర్‌ఎస్ గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేందుకు పనిచేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి, అధికారికి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News