Wednesday, January 22, 2025

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ఎన్‌డిఎ హవా

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో హోరాహోరీ అంటున్న కొన్ని సంస్థలు
ఎన్‌డిఎ కూటమికి స్పష్టమైన మెజారిటీ
వస్తుందన్న పీపుల్స్ పల్స్, చాణిక్య, మాట్రిజ్
లోక్‌షాహీ, దైనిక్ భాస్కర్ భిన్న అంచనాలు
మహారాష్ట్రలో 59 శాతం, జార్ఖండ్‌లో
67.87శాతం పోలింగ్ రెండు రాష్ట్రాల్లో
ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు 23న ఫలితాలు

ఎగ్జిట్ పోల్స్ (మహారాష్ట్ర)
సంస్థ బిజెపి + కాంగ్రెస్ + ఇతరులు
పీపుల్స్ పల్స్ 182 97 9
ఎబిపిమ్యాట్రిజ్ 150—170 110130 810
పి మార్క్ 137157 126146 28
చాణక్య స్ట్రాటజీస్ 152160 130138 68
పోల్ డైరీ 122186 69121 1229
టైమ్స్ నౌ జెవిసి 150167 107125 1314
దైనిక్ భాస్కర్ 125140 135150 2025

ఎగ్జిట్ పోల్స్ (జార్ఖండ్)
సంస్థ బిజెపి + జెఎంఎం+ ఇతరులు
పీపుల్స్ పల్స్ 4658 2437 610
మ్యాట్రిజ్ 4247 2530 14
టైమ్స్ నౌ/ జెవిసి 4044 3040 12
చాణక్య స్ట్రాటజీస్ 4550 3538 35
యాక్సిస్ మై ఇండియా 25 53 3
పి మార్క్ 3140 3747 16
దైనిక్ భాస్కర్ 3740 3639 02

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వంలోని కూటములు తిరిగి అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సూచిస్తున్నాయి. మహారాష్ట్రలో బిజెపి సారథ్యంలోని మహాయుతి కూటమి హవా సాగవచ్చునని ఆ పోల్స్ చెబుతున్నాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మెజారిటీ మార్క్ 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బిజెపి 149, శివసేన 81, ఎన్‌సిపి 59 స్థానాలో పోటీ చేశాయి. ప్రతిపక్షంలోని ఎంవిఎలోని కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95, ఎన్‌సిపి (ఎస్‌పి) 86 సీట్లలో పోటీ చేయగా, బిఎస్‌పి 237, ఎంఐఎం 17 స్థానాల్లో బరిలో నిలిచాయి. మహాయుతికి 130 నుంచి 160 (మహా వికాస్ అఘాడి ఎంవిఎ)కు 120 నుంచి 140 సీట్లు వస్తాయని ఎగ్జిల్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి.

ఇక ఝార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా, మెజారిటీ మార్క్ 41. బిజెపి 68, ఎజెఎస్‌యు 10, జెడి (యు) 2 చోట్ల, లోక్ జన్ శక్తి (రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఇండియా కూటమి తరఫున జెఎంఎం 43, కాంగ్రెస్ 30,ఆర్‌జెడి 6, సిపిఐ (ఎంఎల్) 4 చోట్ల పోటీ చేశాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఇండియా కూటమి సీట్లు భారీగా తగ్గవచ్చునని ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇతరులు 1నుంచి 10స్థానాల వరకు గెలిచే అవకాశం ఉందని ఆ పోల్స్ అంచనా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News