Tuesday, November 5, 2024

మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Anil Deshmukh
ముంబయి: మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)అధికారులు 12 గంటలపాటు విచారించిన అనంతరం ఆయనను అరెస్టు చేశారు. కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణపై అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌కు ఇడి సమన్లు జారీచేసింది. ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ మధ్యనే ఇడి అధికారులు ఆయన ఆస్తులను జప్తు చేశారు. ముంబయిలోని బార్లు, రెస్లారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ ఇప్పటికే సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణ కారణంగానే అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఇదిలావుండగా తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ అనిల్ దేశ్‌ముఖ్ ఓ వీడియోను విడుదలచేశారు. అయితే అనిల్ దేశ్‌ముఖ్ లంచం కేసులో ఓ వ్యక్తిని సిబిఐ ఆదివారం అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News