Wednesday, January 29, 2025

శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పాముల కలకలం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల దగ్గర విషపూరితమైన పాములు ఉన్నట్టు అధికారులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళలు బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి పాములు తీసుకురాగా అక్కడ తనిఖీలు సరిగా చేయలేదా.. లేదా మహిళలు తనిఖీలు దాటి పాములు ఎలా తీసుకువచ్చారని అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ మహిళలు పాములను ఎందుకు తీసుకువచ్చారు. ఈ ఫార్ములా వల్ల వారు చేస్తున్నది ఏమిటి? ఎన్ని రోజులుగా ఇలాంటి పనులకు వారు పాల్పడుతున్నారు.. అనే కోణంలో కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News