Friday, December 20, 2024

బిజెపి రాష్ట్ర కార్యవర్గం విస్తరణ

- Advertisement -
- Advertisement -
125 మందికి చోటు కల్పించిన పార్టీ అధిష్టానం

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ సంస్ధాగత విస్తరణలో భాగంగా సామాజిక, భౌగోళిక అంశాలను పరిశీలనలోకి తీసుకుని 125 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు బిజెపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌యకుమార్ ఆదేశాల మేరకు నియమించిన కార్యవర్గం వెంటనే అమలుల్లోకి వస్తుందని పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గం(కార్యవర్గ సభ్యులతో) తో పాటు అదనంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించడం జరిగింది. కొన్ని ప్రచార మాధ్యమాలలో నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించినట్లు వస్తున్నదని, కొత్తగా నియమించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అదనంగా నియమించినట్లు భావించాలని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News