Monday, December 23, 2024

15 లోగా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

- Advertisement -
- Advertisement -

Expansion of Maharashtra Cabinet in 15th august

ఫడ్నవిస్‌కు హోం శాఖ!

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ వారంలోకనీసం 15 మంది మంత్రులతో తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలకమైన హోంమంత్రి పదవిని తన వద్దే ఉంచుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. మరోవైపు ఒబిసి రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా ఆలస్యం అయిన స్థానిక సంస్థల ఎన్నికలు సుప్రీంకోర్టునుంచి వివరణ తీసుకున్న తర్వాత అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శివసేనలో తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా జూన్ 30వ తేదీన ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో వీరిద్దరే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ ఉండడంతో మాజీ హోంమంత్రి, ఎన్‌సిపి నేత అజిత్ పవార్ సహా ప్రతిపక్ష నాయకులతీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.‘

అజిత్ పవార్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలాంటి విమర్శలు చేయడం సహజమే. అయితే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 32 రోజుల పాటు కేవలం అయిదుగురు మంత్రులే ఉన్న విషయాన్ని అజిత్‌దా మరిచిపోయినట్లున్నారు’ అని ఫడ్నవిస్ ఆదివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మీరు ఊహించినదానికన్నా ముందే జరుగుతుంది’ అని విలేఖరులు పదేపదే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈ నెల 15కన్నా ముందే ఈ ప్రక్రియ జరుగుతుందని బిజెపి వర్గాలు తెలిపారు.

మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కారణంగా రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదని, త్వరలోనే మరింతమంది మంత్రులను చేర్చుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శనివారం చెప్పారు. ‘ప్రభుత్వం పనితీరు ఏ విధంగాను ప్రభావితం కాలేదు. నిర్ణయ ప్రక్రియ కూడా ప్రభావితం కాలేదు. నేను, ఉప ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నాం. మంత్రులు లేనందువల్ల ఎటువంటి ప్రభావం లేదు’అని షిండే ఇక్కడ విలేఖరులతో అన్నారు. కాగా శనివారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశానికి, ఆదివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు షిండే దేశ రాజధానికి వచ్చారు.అయితే ఈ ఢిల్లీ పర్యటనకు, మంత్రివర్గ విస్తరణతో ఎలాంటి సంబంధం లేదని షిండే స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News