Wednesday, January 22, 2025

పునరావాస పనులు వేగవంతం : లోక్‌ష్ జైస్వాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కవ్వాల్ అభయారణ్యంలోని కోర్ ఏరియాలో గ్రామాల పునరావాస పనులను వేగవంతం చేయాలని అటవీశాఖ అధికారులను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ లోకేష్ జైస్వాల్ ఆదేశించారు. మంగళవారం కవ్వాల్ అభయారణ్యాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా అటవీశాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగాటైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల రక్షణ, నివాస అభివృద్ధి పనులు, పులుల పర్యవేక్షణ, సంరక్షణ నిర్వహణ, వ్యూహాలపై సమీక్షించారు. కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపు.. పునరావాస పనులు వేగవంతం చేయాలని, ఎకో సెన్సిటివ్ జోన్ల ప్రకటన, రక్షిత ప్రాంతాల నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమావేశంలో అటవీశాఖ ఉన్నతాధికారులు వినోద్‌కుమార్‌తో పాటు మంచిర్యాల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ డివిజన్‌ల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News