Monday, December 23, 2024

సబ్‌డివిజన్ కార్యాలయంతో పిఆర్‌లో పనులు వేగవంతం

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట: పంచాయతీల్లో అభివృద్ద్ధి పనులకు నిరంతరం పనిచేసే శాఖ పంచాయతీ రాజ్ అని, సదాశివపేటలో సబ్ డివిజన్ కార్యాలయంతో ప్రజా ప్రతినిధులకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని రాష్ట్ర చేనేత కార్పోరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం సదాశివపేటలో పంచాయతీ రాజ్ ఇంనీరింగ్ విభాగం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రతి పనికి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. అందరికి అనుకూలంగా ఉండే సదాశివపేటలో పంచాయితీ రాజ్ సబ్‌డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో సమస్యలు తీరుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈఈ జగదీశ్వర్, ఎంపిపి యాదమ్మ, కొండాపూర్ మాజి ఎంపిపి విఠల్, సొసైటీ చైర్మెన్ రత్నాకర్‌రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం కొండాపూర్ మండల అధ్యక్షుడు పాండురంగం, సర్పంచ్‌లు లకా్ష్మరెడ్డి, రాములు, పార్టీ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, పిఆర్ ఎఇ కృష్ణ, నాయకులు చంద్రశేఖర్, రాంచంద్రయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News