Monday, November 18, 2024

120 గంటల పాటు ‘ఆకలి బాధ అనుభవించా:నారాయణమూర్తి

- Advertisement -
- Advertisement -

యాభై సంవత్సరాల క్రితం యూరప్‌లో వేరొకరి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు 120 గంటల పాటు నిరంతరాయంగా ‘ఆకలి బాధ అనుభవించాను’ అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. ‘ఆహార భద్రతలో విజయాలు: సుస్థిర అభివృద్ధి లక్షాల (ఎస్‌డిజి) దిశగా భారత్ అడుగులు’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితి (యుఎన్)లోని భారత శాశ్వత మిషన్ యుఎన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడారు, భారత ఎన్‌జిఒ అక్షయ పాత్ర ఫౌండేషన్ సమకూర్చిన నాలుగు వందల కోట్లవ భోజనం ప్రత్యేక సందర్భంగా కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడారు.

ఆహార భద్రత, పౌష్టికాహారంలో భారత్ సృజనాత్మక వ్యూహాలు, విధానాలు, విజయాలను, ఎస్‌డిజిలతో వాటి అనుసంధానం ముఖ్యంగా‘జీరో హంగర్’ లక్షం దిశగా భారత్ అడుగులను ఆ కార్యక్రమం ప్రధానంగా ప్రస్తావించింది. నారాయణమూర్తి యుఎన్ దౌత్యవేత్తలు, అధికారులు, విద్యావేత్తలు, పౌర సమాజ సంస్థలు, భారత సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘మీలో చాలా మంది ఆకలి బాధ అనుభవించి ఉండరు. నేను అనుభవించాను’ అని చెప్పారు. 50 ఏళ్ల క్రితం ‘యూరప్‌లో, బల్గేరియా, అప్పటి యుగోస్లావియా, ఇప్పటి సెర్బియా మధ్య సరిహద్దు పట్టణం నిష్‌లో వేరొకరి వాహనంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు ఏకబిగిన 120 గంటల పాటు ఆకలి బాధ అనుభవించాను’ అని నారాయణమూర్తి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News