న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల విద్యుత్తు వాహనాలు కాలిపోవడం పరిపాటయింది. అది ఛార్జింగ్ పెడుతున్న సమయంలో కావొచ్చు, ప్రయాణిస్తున్న సమయంలో కావొచ్చు ఇలా జరుగుతోంది. భవిష్యత్తులో అంతా విద్యుత్ వాహనాలదే హవా అని భావిస్తున్న తరుణంలో అగ్ని ప్రమాదాలు పెరుగుతుండడంతో కేంద్రం దృష్టినిసారించింది. విద్యుత్తు వాహనాలు ఎందుకు తగులబడిపోతున్నాయో తెలుసుకునేందుకు ఓ నిపుణుల కమిటీని(ఎక్స్‌పర్ట్ కమిటీ) ఏర్పాటు చేసింది. ఆ నిపుణుల కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది. చాలా ప్రమాదాలు బ్యాటరీ లోపాలు, షార్ట్ సర్యూట్ కారణంగానే జరిగాయని గుర్తించింది. ‘సెల్ఫ్ వెంటింగ్ మెకానిజంలో తీవ్ర లోపాలు’ ఉన్నాయని గుర్తించింది. నాణ్యత లేని వాహనాలను విక్రయించాయన్న కంపెనీలపై జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదివరలో కేంద్ర మంత్రి గడ్కరీ కూడా విద్యుత్తు వాహనాల ప్రమాదం గురించి వ్యాఖ్యానిస్తూ ట్వీట్ కూడా చేశారు.
Several mishaps involving Electric Two Wheelers have come to light in last two months. It is most unfortunate that some people have lost their lives and several have been injured in these incidents.
— Nitin Gadkari (@nitin_gadkari) April 21, 2022