Sunday, January 19, 2025

కాళేశ్వరంపై నిపుణుల కమిటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నా ణ్యతపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వె ళ్లాలని అన్నారు. తాత్కాలికంగా హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దంటూ నీటిపారుదలశాఖ అధికార యంత్రాంగాన్ని సిఎం అప్రమ త్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను ప రిగణనలోకి తీసుకొని తదుపరి మరమ్మతులు, పు నరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

గతంలో అధికారంలో ఉన్న వాళ్లు చేసిన తప్పుల కు ఇప్పటికే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. సుమారు లక్షన్నర కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు ఎనిమిది పది వేల కోట్లు అవసరమయితే ఖర్చుకు ఆలోచించాల్సింది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లే దని అన్నారు. శనివారం డా. బిఆర్ అంబేద్కర్ స చివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమి టీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రెండు మూడు రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తనతో పాటు ఇరిగేషన్ మంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొంటామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగిన ఫిల్లర్లను రిపేర్లు చేయిస్తే సరిపోతుందా.. లేదా ఉన్నవి తొలిగించి కొత్తవి కట్టాలా.. కొన్నింటిని రిపేర్లు చేసి కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా అనేది ఈ కమిటీ తో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామన్నారు.
త్వరలో అఖిలపక్ష సమావేశం
కృష్ఱా జలాల్లో మన రాష్ట్ర నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అదికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణ జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కృష్ణా నది యాజమాన్యబోర్డు ప్రతిపాదించిన ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని తెలిపారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించినట్లు వస్తున్న ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏ ప్రాజెక్టు అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. ’కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 45 రోజులైందని, ఈ కొద్ది రోజుల్లోనే ఎప్పుడు కృష్ణా బోర్డుతో సమావేశాలు జరిగాయి, ఎవరు హాజరయ్యారు, ఏవిధమైన నిర్ణయాలు తీసుకున్నారు ,తమకు తెలియకుండా అధికారులేమైనా నిర్ణయాలు తీసుకున్నారా, అని అధికారులను ప్రశ్నించారు. ఈ వివయాల్లో నీటిపారుదలశాఖపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు..’ అంటూ ఇరిగేషన్ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీగా రాజకీయ విమర్శలు చేయడం వేరని, శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయి. కృష్ణా జలాల్లో ఎంత వాటా ఉందో వాళ్లకు తెలియదా, వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో.. అఖిల పక్ష సమావేశంలో చర్చకు పెడుదామని సీఎం అన్నారు.
ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు నివేదికలు సిద్దం చేయండి
రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలతో నివేదికలు సిద్దం చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని అన్నా రు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చే యాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులపై వివరాలను అ ధికారులకు సీఎంకు నివేదించారు. ప్రాధాన్యతలవారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఎస్‌ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టన్నెల్ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని చెప్పారు. ఎస్‌ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూ ర్తి చేయాలని సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. తక్కువ సమయం లో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ఆయకట్టు రైతులకు నీరందించే చర్యలు చేపట్టాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నె ట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, నారాయణపేట కొడంగల్ లిప్ట్ లను ప్రస్తావించి, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ముందున్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను వందశాతం పూర్తి చేయాల్సిందేనని అన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News