Thursday, January 2, 2025

వచ్చే నెల 4న చంద్రునిపై కూలనున్న అంతరిక్ష వ్యర్థం

- Advertisement -
- Advertisement -

Experts say rocket will hit moon on March 4

 

బీజింగ్ : పరిశోధనల్లో భాగంగా చంద్రుని పైకి చైనాకి సంబంధించిన ఒక అంతరిక్ష వ్యర్థం వచ్చిందని నిపుణులు తెలిపారు. ఈ మేరకు మార్చి 4న చంద్రుడిని ఒక రాకెట్ ఢీకొట్టనుందని నిపుణులు వెల్లడించారు. తొలుత ఖగోళ శాస్త్రవేత్తలు అది స్పేస్ ఎక్స్ రాకెట్‌లోని భాగంగా భావించారు. కానీ అది ఏడేళ్ల క్రితం పేలిపోయిందని దాని మిషన్ పూర్తయిన తర్వాత అంతరిక్షంలోకి వదిలివేయబడిందని నిర్ధారించారు. కానీ ఇప్పుడూ చైనీస్ స్పేస్ ఏజెన్సీ చంద్ర అన్వేషణ కార్యక్రమంలో భాగంగా 2014లో ‘చాంగే’ 5-టి1 రాకెట్‌ని అంతరిక్షంలోకి పంపిందని, అది ఆ రాకెట్‌కి సంబంధించిన బూస్టర్ అని కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఆ రాకెట్ మార్చి 4న చంద్రుని వైపు కూలిపోతుందని భావిస్తున్నారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ వాదనను ఖండించింది. అంతేకాదు మీరు అనుమానిస్తున్న ఆ బూస్టర్ భూ వాతావరణంలోకి సురక్షితంగా ప్రవేశించి కాలిపోయిందని పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News