Monday, December 23, 2024

పేలిన ఎలక్ట్రిక్ బైక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ జిల్లా నియోజకవర్గం రామడుగు మండలంలోని రామచంద్రాపూర్ గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్‌కు పేలిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎగుర్ల ఓదెలు గత రెండు నెలల క్రితం బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగా సోమవారం ఇంట్లో చార్జింగ్ పెట్టగా బ్యాటరీ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన యజమాని విద్యుత్ కనెక్షన్ తొలగించి మంటలు ఆర్పివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి అపాయం జరుగలేదు. వాహనాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేసినట్లు బాధితుడు వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News