- Advertisement -
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్‌లో మంగళవారం ఉదయం పుట్టి లచ్చవ్వ భర్త దుర్గయ్య ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ శబ్దంతో గ్యాల్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి ఇంటిపైకప్పు ఎగిరిపోయి మంటలు చెలరేగి పక్కనే ఉన్న పుట్టి పోచవ్వ ఇంటికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
నష్టపోయిన బాధితులకు గ్రామ సర్పంచ్ జగదీశ్వర్‌చారి, అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ సర్పంచ్, వైస్ ఎంపిపి సాయిరెడ్డి, ఉప సర్పంచ్ రాంచందర్‌పాటిల్, ఎంపిటిసి సబితా లింగారెడ్డిల ఆధ్వర్యంలో ప్రస్తుతానికి వంటకు సంబంధించిన వస్తువులను బియ్యం, కూరగాయలు, నగదు రూపంలో కొంతమేర వారికి ఆర్థిక సహాయం అందజేశారు.
- Advertisement -