Sunday, December 22, 2024

చెత్తలో పేలుడు..ఒకరికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

సెంట్రల్ కోల్‌కతాలో జరిగిన పేలుడు ఘటనలో చెత్త ఏరుకునే వ్యక్తి ఒకరు గాయపడ్డారు. శనివారం ఈ ఘటన జరిగింది, జీవనాధారానికి రోజువారిగానే రోడ్డు పక్కన చెత్త ఏరుకుంటున్న వ్యక్తి పట్టుకున్న వస్తువు పేలింది. దీనితో ఒళ్లంతా గాయాలు అయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 1.45 గంటలకు జరిగిన ఈ ఘటనతో తల్తాలా ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసు అధికారులు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

చేతికందిన వస్తువు పేలిన ఘటనలో ఈ సామాన్యుడి చేతివేళ్లు దెబ్బతిన్నాయని, ఆసుపత్రికి తరలించారని అధికారులు వెల్లడించారు. ఘటన స్థలి వద్దకు వెంటనే బాంబు స్కాడ్ చేరుకుంది. అక్కడ ఓ గోనె సంచి దొరికింది. గాయపడ్డ వ్యక్తి 58 సంవత్సరాల బాపిదాస్ అని గుర్తించారు. చెత్త ఏరుకుని జీవించే ఈ వ్యక్తి అక్కడి ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తుంటాడని , బంధువులు ఎవరూ లేరని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News