- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్‌లో తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 6, 7 , 8 వ తేదీలలో హైదరాబాద్ లోని ఎల్‌బి నగర్‌లోలో ఉన్న కెబిఆర్ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న ఎక్స్‌ఫ్లోర్ ఫీచర్ ఆఫ్ ఫోటోగ్రఫీ @ హైదరాబాద్ పేరుతో ఫోటోగ్రాఫర్లకు అవగాహన కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పో పై రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, సైలెందేర్ , ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిదులు పాల్గోన్నారు.
- Advertisement -