Monday, January 27, 2025

టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు..12 మంది మృతి

- Advertisement -
- Advertisement -

టర్కీ లోని ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ బల్కిసెర్ ప్రావిన్స్ లోని కవక్లి అనే పట్ణణ శివార్లలో ఉంది. దీనిలో మందుగుండు, ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. టర్కీ కాలమానం ప్రకారం ఉదయం 8.25 నిమిషాలకు జరిగిన ఈ పేలుడు దెబ్బకు భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగసింది.

జెఎస్‌ఆర్ ఎక్స్‌ప్లోజివ్స్‌ఫ్యాక్టరీ లోని ప్రధాన భవనం పూర్తిగా కూలిపియింది. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. దీనిని క్యాప్సుల్ ప్రొడెక్షన్ విభాగంగా పేర్కొంటున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు ఆ దేశ ఇంటీరియర్‌మంత్రి వెల్లడించారు. ఇప్పుడే ప్రమాదానికి కారణాలను వెంటనే చెప్పలేమన్నారు. పేలుడు జరిగిన వెంటనే భారీగా అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు అక్కడికి చేరుకొన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News