Wednesday, January 8, 2025

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

తమిళనాడు లోని డిండిగల్ జిల్లాలో బాణాసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నాధం వద్ద ఈ సంఘటన జరిగినట్లు పోలీస్‌లు చెప్పారు. ఆ యూనిట్ యజమాని పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News