Sunday, December 22, 2024

బతుకులు ఛిద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఫరూఖ్‌నగర్/హైదరాబాద్: పొట్ట చేత బట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన వలస బిహార్, జార్ఖండ్ కార్మికులు రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవర్గం, ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఒక పరిశ్రమలో అసువులు బాసారు. వివరాల్లోకి వెళ్తే… ఫరూఖ్‌నగర్ మండ ల పరిధిలోని చింతగూడ, బూర్గుల గ్రామ శివారులోని సౌత్ గ్లాస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 12మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గ్లాస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో వాహనాలకు వినియోగించే అద్దాలను తయారు చేయడంతో పాటు వి విధ వాహనాల గ్లాస్ సైజ్‌లను కట్ చేస్తారు. శుక్రవారం సాయంత్రం పరిమ్రలో గ్లాస్ తయారుచేసే మి షనరీలో ఫర్నేస్ అధిక వేడి కారణంగా కంప్రెషర్ పేలింది. దీంతో గ్లాస్ లు పగిలి కార్మికులకు తగలడంతో వారి శరీర భాగాలు చిన్నాభిన్నం అయ్యాయి ప్రమాద ప్రాంతంలో సమీపంలో ఉన్న కార్మికులు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు.

ఇద్దరి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 15మందిని షాద్‌నగర్‌లోని ఒక ప్ర యివేటు ఆస్పత్రికి, మరికొంతమందిని శంషాబాద్, హైదరాబాద్ ఆస్పత్రిలకు తరలిస్తుండగా మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాంఅశీష్ (30) చికి త్స పొందుతూ మృతి చెందగా, చిత్తరంజన్, శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్ద రు మృతుల్లో ఉన్నారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా ఉండడంతో మృతు ల పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శంషాబాద్ డిసిపి పరిశ్రమను సందర్శించి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. షాద్‌నగర్ మాజీ ఎంఎల్‌ఎ బక్కని నర్సింలు, అంజయ్యయాదవ్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష వైఖరిపై మండిపడ్డారు. నైపుణ్యంలేని కార్మికులను విధుల్లో ఉంచడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో ఏడాది కాలంలో వివిధ పరిశ్రమల్లో నాలుగు ప్రమాదాలు చోటుచేసుకోగా ఇందులో సుమారు 10 మందికి పైగా వలస కార్మికులు మృతి చెందగా 40 మందికి పైగా గాయాల పాలయ్యారు.

అధికారులను అప్రమత్తం చేసిన సిఎం
షాద్‌నగర్ ప్రమాద ఘటనపై సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించాలని, కలెక్టర్‌కు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీ సు, అగ్నిమాపక శాఖ, కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సిఎం ఆదేశించారు. షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాసు పరిశ్రమలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాల య్యాయి. కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కంప్రెషర్ పేలడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News