Thursday, December 26, 2024

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శనివారం నటి సన్నీ లియోన్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో వేదిక సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. సన్నీ లియోన్ ఆదివారం ఈ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో ప్రాణనష్టం ఏదీ సంభవించలేదని చెప్పారు.

కట్టా కంజీబంగ్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. శనివారం ఉదయం 6.30 ప్రాంతంలో ఫ్యాషన్ షో వెన్యూకు 100 మీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఐఇడి పేలుడా లేక గ్రెనేడ్ పేలుడా అన్నది ఇంకా తేలలేదు. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ తీవ్రవాద సంస్థ బాధ్యత తీసుకోలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News