Monday, December 23, 2024

బాణాసంచా గోదాంలో భారీ పేలుడు… నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Explosion in firecracker godown in Morena

భోపాల్ : మధ్య ప్రదేశ్ లోని మోరేనా జిల్లా బన్మోర్‌నగర్‌లో గురువారం బాణాసంచా నిల్వ చేసిన గోదాంలో భారీ పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భారీ పేలుడుతో ఫైర్‌క్రాకర్స్ నిల్వ చేసిన గోదాం తునాతునకలైంది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొన్ని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. గోదాంలో గన్‌పౌడర్ వల్ల పేలుడు జరిగిందా లేదా గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లనా అనే అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు మొరేనా కలెక్టర్ బక్కి కార్తికేయన్ తెలిపారు. సహాయక బృందాలు, పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నట్టు ఐజీ రాజేశ్ చావ్లా తెలిపారు. మూడేళ్ల క్రితం పంజాబ్‌లో ఇలాంటి సంఘటనే జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News