Monday, December 23, 2024

బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురి మృతి

- Advertisement -
- Advertisement -

బరసాత్ (పశ్చిమబెంగాల్) : పశ్చిమబెంగాల్ లోని నార్త్ 24 పరగణా జిల్లా నీల్‌గుంజ్ మోష్‌పోల్ ప్రాంతంలో ఆదివారం ఉదయం బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందారు. ఫ్యాక్టరీలో అనేక మంది పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. అనేక మంది శిధిలాల కింద ఇరుక్కున్నట్టు భావిస్తున్నామని పోలీస్‌లు చెప్పారు.

ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పోలీస్‌లు రిస్క్ దళాలు అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అక్రమంగా ఈ ఫ్యాక్టరీ నడుపుతున్నట్టు తెలుస్తోంది. గత మేలో రాష్ట్రం లోని ఏగ్రాలో అక్రమంగా నడుసున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి అక్రమ ఫ్యాక్టరీలపై పర్యవేక్షణ సరిగ్గా ఉండడం లేదని బీజేపీకి చెందిన విపక్షనాయకుడు సువేందు అధికారి విమర్శించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News