Thursday, January 23, 2025

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

- Advertisement -
- Advertisement -

11మంది దుర్మరణం

వంద మందికిపైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘటన
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా బైరాగఢ్ గ్రామం లో మంగళవారం ఒక బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 11 మంది మరణించగా మరో 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఫ్యాక్టరీ సమీపంలోని 50కి పైగా ఇళ్లు కాలిపోయాయయని వర్గాలు తెలిపాయి. ఫ్యాక్టరీలో భారీ మొత్తంలో నిల్వచేసిన గన్‌పౌడర్ కారణంగానే పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఫ్యాక్టరీలో మంట లు వ్యాపించి వరుసగా అనేకసార్లు పేలుళ్లు సంభవించగా సమీపంలో నివసిస్తున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారి ఒకరు తెలిపారు. పేలుళ్ల తీవ్రతకు నర్మదాపురం జిల్లాలోని సియోని మాల్వా ప్రాం తంలోని ఇళ్లు కంపించినట్లు అక్కడి నివాసులు తెలిపారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ విషాద ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పేలుడు కారకులైనవారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అధికారులతో మాట్లాడి సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. హృదయవిదాకరమైన ఈ ఘటనను దృష్టిలో ఉం చుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్, సీనియర్ అధికారులు హుటాహుటిన హర్దాకు బయల్దేరి వెళ్లారు. కాలిన గాయాలతో వచ్చే రోగుల కోసం బెడ్లను సిద్ధం చే యాలని భోపాల్, ఇండోర్‌లోని వైద్య కళాశాలలను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షతగాత్రులను త్వరితంగా తరలించేందుకు వీలుగా హర్దా నుంచి భోపాల్‌కు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. పేలుడు స్థలి వద్ద ఎటువంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా వివిధ జిల్లాల నుంచి 35కి పైగా అంబులెన్సులను హర్దాకు ప్రభుత్వం పంపింది.
ప్రధాని మోడీ సంతాపం
మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో పలువురు మరనించిడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పేలుడులో తమ ఆప్తులను కోల్పోయిన కోల్పోయిన వారికి ప్రధాని తన సంతాపాన్ని తెలియచేశారు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. మృ తుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్టపరిహారాన్ని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హర్దా పేలుడు ఘటన పట్ల విచారం వ్య క్తం చేశారు. బాధిత కు టుంబాలకు ఆమె సంతాపాన్ని ప్రకటించారు. ఉప రాష్ట్రప తి జగ్‌దీప్ ధన్‌కర్ కూడా తన సంతాపాన్ని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News