Sunday, February 23, 2025

తమిళనాడు బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: శివకాశీ బాణాసంచా ఫ్యాక్టరీలో నేడు భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శివకాశీలోని చెంగమాల పట్టిలో శరవణన్ కు చెందిన ‘శ్రీ సుదర్శన్ క్రాకర్స్’ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచలో మందు నింపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు మంది మహిళలతో సహా ఎనిమిది మంది మరణించారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పేలుడు కారణం ఏమిటనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News