Monday, December 23, 2024

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కృష్ణగిరి: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీపేలుళ్లు సంభవించి భవనం కుప్పకూలిన ఘటనలో 8మంది మృతి చెందగా, మరో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. భవన శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుపడి ఉండారని అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఫ్యాక్టరీ యజమాని, భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే దాని ప్రభావానికి పక్కనే ఉన్న హోటల్ కుప్పకూలిపోగా, మరో మూడు, నాలుగు భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో హోటల్ యజమాని, పొరుగున ఉన్న మరో ఇద్దరు కూడా ఉన్నారు. అగ్నిమాపక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. కాగా మరో నలుగురి జాడ తెలియకపోవడంతో వారు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News