Sunday, December 22, 2024

పంజాబ్‌లోని హౌరా మెయిల్‌ కోచ్‌లో పేలుడు: నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: పంజాబ్‌లోని ఫతేఘఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా మెయిల్ జనరల్ కోచ్‌లో పేలుడు సంభవించి నలుగురు వ్యక్తులు గాయపడినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) అధికారులు ఆదివారం తెలిపారు.

రైలు అమృత్‌సర్‌ నుంచి హౌరాకు శనివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో వెళుతున్న మెయిల్ లో బాణాసంచాతో కూడిన ప్లాస్టిక్ బకెట్‌లో పేలుడు సంభవించిందని వారు తెలిపారు. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు జిఆర్‌పి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగ్మోహన్ సింగ్ తెలిపారు. రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో కొన్ని బాణాసంచాలు ఉన్న ప్లాస్టిక్ బకెట్‌లో పేలుడు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News