Wednesday, January 22, 2025

మణికొండలో పేలుడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెమికల్ డబ్బా పేలుడు కలకలం సృష్టించిన సంఘటన మణికొండలోని లాలమ్మ గార్డెన్ వద్ద బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పేలుడులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం… గుడిమల్కాపూర్‌కు చెందిన రాజేంద్ర(25) రోజు మాదిరిగానే చెత్త ఏరుకునేందుకు మణికొండలోని లాలమ్మ గార్డెన్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న చెత్త డంపు నుంచి చెత్తను ఏరుకుంటుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో రాజేంద్ర చేతులు, కాలికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న నార్సింగి ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన రాజేంద్రను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చెత్త డంపులోని కెమికల్ డబ్బాలు పేలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజేంద్రకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్సై అనిల్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News