Thursday, January 23, 2025

నెల్లూరు పోలీస్ స్టేషన్ లో పేలుడు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 జూన్ లో జరిగిన ఓ కేసుకు సంబందించిన గన్ పౌడర్ ను సీజ్ చేసి నాశనం చేయడం జరిగింది. ఇందులో కొంత భాగాన్ని ఎఫ్ఎస్ఎల్ కోసం ఉపయోగించిన గన్ పౌడర్ ను జిడి నెల్లూరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింది భాగంలో పూడ్చిపెట్టారు. దీని వలన మర్రి చెట్టు దగ్గర చిన్న పాటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ప్రజలకు కాని పోలీస్ సిబ్బందికి గాని ఎటువంటి గాయాలు కాలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు కాని, పోలీస్ స్టేషన్ కి కాని పోలీస్ స్టేషన్ లో ఎలాంటి నష్టం జరగలేదని అలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. ఇది చాలా చిన్న పేలుడని ఎటువంటి ఉదంతాలను నమ్మవద్దని చిత్తూరు జిల్లా ఎస్పి వై.రిశాంత్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఎఎస్ఐ  తీవ్రంగా గాయపడ్డారనేది వార్తలు అవాస్తవమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News