Friday, December 27, 2024

స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

దుర్గ్ : చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా రస్మాడా ఏరియాలోగల స్టీల్ ఫ్యాక్టరీలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించి కార్మికుడు ఒకరు చనిపోయారు. స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని భిలాయ్ లోని జెఎల్‌ఎన్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఖెమ్‌లాల్ సాహు (38) అనే కార్మికుడు చనిపోయాడని పోలీస్‌లు చెప్పారు. మిగతా ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News