Wednesday, January 22, 2025

చర్లపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని చర్లపల్లిలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. వెంకట్‌రెడ్డి నగర్ మధుసూదన్ రెడ్డినగర్‌లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో మ్యాన్‌హాల్ బిళ్ల గాల్లోకి ఎగిరిపడింది. దీంతో కాలనీలో మొత్తం కెమికల్ వాసన వ్యాపించింది. ఈ ఘటనతో వెంకట్ రెడ్డి నగర్ మధుసూదన్ రెడీ నగర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News