- Advertisement -
దుబాయ్: మందుగుండు సామగ్రితో కూడిన ఒక పడవ సౌదీ అరేబియాలోని యాన్బు రేవును లక్ష్యంగా చేసుకుని దాడిచేసింది. డ్రైవర్ లేకుండా రిమోట్ సాయంతో పనిచేసే ఈ పడవను ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అయితే ఈ పేలుడు కారణంగా రేవు సమీపంలో వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి ఉంటాయని ప్రైవేట్ భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇరాన్, ఇజ్రేల్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వరుసగా జరుగుతున్న దాడుల పరంపరలో భాగంగానే ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాన్బు రేవును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ పడవ దాడి జరిపిందని సౌదీ సైనిక ప్రతినిధి కల్నల్ తుర్కీ అల్-మాలికిని ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ వార్తాసంస్థ తెలిపింది.
- Advertisement -