Monday, December 23, 2024

కూరగాయల సాగులో ఎగుమతి రకాలకు ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -
హర్టీకల్చర్ వర్శిటీ విసి డా.నీరజ

హైదరాబాద్ : కూరగాయ తోటల సాగులో ఎగుమతి రకాల విత్తనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టీ కల్చర్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ డా. నీరజా ప్రభాకర్ వెల్లడించారు. ఈ రకాల సాగు ద్వారా రైతులకు నికర లాభాలు సాధ్యపడతాయన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన లెమన్‌చిల్లీ ఫార్మ్‌కు యూనివర్శిటీకి మధ్యన పరస్పర సహకార ఒప్పందం కుదిరింది. డా.నీరజా ప్రభాకర్ సమక్షలంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డా.భగవాన్, లెమన్ చిల్లీఫార్మ్ డైరక్టర్ వెల్కూరి రితీష్ ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేశారు.

ఈ సందర్బంగా విసి మాట్లాడుతూ విదేశీ కురగాయల పంటల సాగులో దిగుబడి , ఉత్పాదకతను పెంపొందించడంలో విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక మార్గదర్శకత్వం ,ఇన్‌పుట్‌లను అందిస్తామన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను సాధించేందుకు తగిన సహకారం అందిస్తామన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్దులకు హార్టీకల్చర్ ఇండస్ట్రియల్ అటాచ్‌మెంట్ ప్రోగ్రాంలను నిర్వహించడంలో లెమన్ చిల్లి ఫార్మ్ నుండి సహకారం అందించడం కోసమే ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ డా.ఏ. కిరణ్ కుమార్ , పిజి స్టడీస్ డీన్ డా.ఎం. రాజశేఖర్ కంట్రోలర్ డా.నటరాజన్ ,డా. డి. విజయ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News