నేనే రియల్ పుష్ప.. ఎర్రచందనం ఎగుమతి చేశా : బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశావ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా, సంధ్య థియేటర్ ఘటనపై చర్చజరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే రియల్ పుష్ప అని బీజేపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లీగల్‌గా ఎర్రచందనం ఎగుమతి చేసినట్లు తెలిపారు.
ఎర్రచందనం అమ్మినోడు, కొన్నవాడు కూడా పుష్పానే అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై స్పందించారు. సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తాడని జోస్యం పలికారు. బాహుబలి 1 లో అధ్యక్షుడికి 3 ఏళ్లు టైమ్ ఇస్తామన్నారు. బాహుబలి పార్ట్ 1 లో మంచిగా చేస్తేనే బాహుబలి 2 లోకి తీసుకుంటామని చెప్పారు. బాహుబలి పార్ట్ 1 లో మంచిగా చేయకపోతే బాహుబలి పార్టు 2 లో మార్చేస్తామని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.