- Advertisement -
న్యూఢిల్లీ :తృణధాన్యాలపై భారత్ మళ్లీ దృష్టి కేంద్రీకరించడం, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న 18 దేశాలకు గత ఏడాది 1.8 మిలియన్ టన్నుల గోధుమలు ఎగుమతి చేయడంపై యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రశంసించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అల్వరో లారియో జి 20 దేశాల సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం ప్రపంచం లోని ఆహార వ్యవస్థలను మార్చే సామర్ధం కల్పిస్తుందని, ఆయా దేశాలకు కావలసిన పోషకాహారాన్ని అందించడమే కాక, సంరక్షిస్తుందని పేర్కొన్నారు. పంటల పెంపకం, పంటల కోత, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్, ఆహార వినియోగం తదితర వ్యవస్థల్లో చెప్పుకోతగిన మార్పు వస్తుందన్నారు.
- Advertisement -