Saturday, November 23, 2024

జనవరిలో 3 శాతం పెరిగిన ఎగుమతులు

- Advertisement -
- Advertisement -

వాణిజ్య లోటు 17.49 బిలియన్ డాలర్లు : ప్రభుత్వ గణాంకాలు

న్యూఢిల్లీ : జనవరిలో దేశ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.12 శాతం పెరిగి 36.92 బిలియన్ డాలర్లకు(రూ. 3.06 లక్షల కోట్లు) చేరుకున్నాయి. గురువారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరిలో దిగుమతులు వార్షిక ప్రాతిపదికన దాదాపు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లకు (రూ. 4.51 లక్షల కోట్లు) చేరాయి. దీంతో జనవరిలో వాణిజ్య లోటు 17.49 బిలియన్ డాలర్లు (రూ. 1.45 లక్షల కోట్లు)గా ఉంది.

ఈ ఆర్థిక సంవత్సరం(202324) ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో ఎగుమతులు 4.89 శాతం క్షీణించి 353.92 బిలియన్ డాలర్లు అంటే రూ. 29.39 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులు 6.71 శాతం క్షీణించి 561.12 బిలియన్ డాలర్లకు (రూ. 46.59 లక్షల కోట్లు) చేరాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ సానుకూల వృద్ధిని నమోదు చేసిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. దేశ వాణిజ్య లోటు 2023 డిసెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన రూ.1.64 లక్షల కోట్లకు తగ్గింది. డిసెంబర్ 2022లో ఇది రూ.1.91 లక్షల కోట్లుగా ఉంది. నవంబర్ 2023లో వాణిజ్య లోటు రూ.1.71 లక్షల కోట్లు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News