Sunday, December 22, 2024

గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

Express collided with goods train

నాగ్‌పూర్/ముంబై: ఛత్తీస్‌గఢ్ నుంచి రాజస్థాన్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్.. గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. మహారాష్ట్రలోని గొండియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు చక్రాలు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఇసిఆర్) సీనియర్ అధికారి మాట్లాడుతూ..బిలాస్‌పూర్ నుంచి జోథ్‌పూర్ వెళుతున్న ఎస్‌ఎఫ్ ఎక్స్‌ప్రెస్ 20843కు చెందిన లోకోపైలట్ భగత్ కి కోటి ట్రైన్‌ను కంట్రోల్ చేయలేకపోయాడన్నారు. దీంతో ఎక్స్‌ప్రెస్ ముందున్న గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టిందన్నారు. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయని, ఆందోళనకు గురైన ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చామన్నారు. ప్రమాద ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ (సిఆర్‌ఎస్) విచారణకు ఆదేశించారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News