Sunday, December 22, 2024

తమిళనాడులో ఢీకొన్న రైళ్లు

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లాలో మైసూరు దర్బంగా ఎక్స్‌ప్రెస్ చెన్నైకి సమీపంలోని కొవరాయిపెట్టాయ్ వద్ద ఆగి ఉన్న గూడ్స్‌రైలును ఢీకొంది. రైలు పట్టాలు తప్పి, రెండు బోగీలలో మంటలు అంటుకున్నాయి. మొత్తం ఆరు బోగీలు పట్టాలు తప్పా యి. వెంటనే అక్కడికి జాతీయ విపత్తు స్పందన సహాయక బృందం ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు, అంబులెన్స్‌లు తరలివెళ్లాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన ట్లు, ప్రాణనష్టం ఏదీ జరగనట్లు అధికారులు తెలిపారు. అయితే కొందరు ప్ర యాణికులు గాయపడ్డట్లు వెల్లడైంది. తిరువళ్లూరు జిల్లా కలెక్టరు టి ప్రభుశంకర్ పరిస్థితిని సమీక్షించారు. వివిధ స్థాయిల బృందాలను అప్రమత్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News