Saturday, December 21, 2024

టిఎంసీ ఎంపి మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు

- Advertisement -
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై శుక్రవారం బహిష్కరణ వేటు పడింది. దీంతో ఆమె సభ్యత్వం రద్దు అయింది. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని మహువాపై ఆరోపణలు ఉన్నాయి. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నివేదికను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎథిక్స్ కమిటీ నివేదికపై లోక్ సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్ సభ ఆమోదించింది. ఇక ఆమె ఎంపిగా కొనసాగడం తగదని స్వీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మహువా మొయిత్రాను సభనుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ముమ్మటికీ రాజకీయ కక్ష సాధింపేనని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి సుదీప్ బంధోపాధ్యాయ తెలిపారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని సుదీప్ పేర్కొన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై తమకు కొంత సమయం కావాలని, నివేదికపై ఓటింగ్ కు ముందు సభలో చర్చ జరపాలని టిఎంసి సహా పలువురు విపక్ష ఎంపిలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News